Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష ఇంకుడు గుంతల లక్ష్యం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 26, 2026 6:42 AM హైదరాబాద్General
లక్ష ఇంకుడు గుంతల లక్ష్యం - Udayam
జలసిరి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 నాటికి లక్ష ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. లక్ష్యాన్ని సాధించిన వారిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానిస్తామని తెలిపారు. ఇంకుడు గుంతలు, పంటకుంటలు, బోర్‌వెల్‌ రీఛార్జ్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఉంటే ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...