Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజ్ఞానందకు రూ.50 లక్షల బహుమతి అందించిన తమిళనాడు సీఎం విజయ్

Follow Udayam on Google
Vikram Chandra Jun 09, 2026 3:26 PM జాతీయంGeneral
ప్రజ్ఞానందకు రూ.50 లక్షల బహుమతి అందించిన తమిళనాడు సీఎం విజయ్ - Udayam
నార్వే చెస్ టైటిల్ గెలుచుకున్న గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నైలో అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించిన 20 ఏళ్ల యువ చెస్ సంచలనానికి ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల బహుమతి చెక్కును సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమిళనాడు ప్రభుత్వ చొరవ అద్భుతమని కొనియాడారు. కాగా, ఈ ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు.

Comments

G
Loading comments...