Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తమిళనాడులో ప్రమాదం.. గ్యాస్ పైప్లైన్ లీక్

Follow Udayam on Google
Rohit Saran Jun 07, 2026 11:04 AM జాతీయంGeneral
తమిళనాడులో ప్రమాదం.. గ్యాస్ పైప్లైన్ లీక్ - Udayam
తమిళనాడులోని రామనాథపురం జిల్లా భరతి నగర్ ప్రాంతంలో భారీ గ్యాస్ లీకేజీ స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. జాతీయ రహదారికి సమీపంలో ఓ బ్యాక్‌హో లోడర్‌ సాయంతో గుంతలు తవ్వుతుండగా ప్రమాదవశాత్తు భూగర్భ గ్యాస్ పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా రోడ్డు మధ్యలో నుంచి భారీగా గ్యాస్ లీక్ అవ్వడం ప్రారంభమైంది. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందుజాగ్రత్తగా వెంటనే గ్యాస్ సరఫరాను నిలిపివేసి, యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు జరగకుండా చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేసి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...