వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు 8వ వార్డులో న్యూ లోటస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీనిని వార్డు కౌన్సిలర్ జావీద్ ప్రారంభించారు. వైద్యం ఖరీదైన వేళ, లారీ పార్కింగ్ వద్ద ఉన్న ఈ ఆసుపత్రిలో రోజూ కేవలం ₹10కే ఓపీ సేవలు అందించడం అభినందనీయమన్నారు.
శిబిరంలో నిపుణులైన వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

