వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి రూ.110 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుర్వ మహిపాల్ అన్నారు.
ఈ నిధులతో కాగ్నా నది ద్వారా తాండూరుతో పాటు యాలాల్‌లోని 14 గ్రామాలకు తాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే రాజకీయాల్లో చిల్లర చేష్టలు, వ్యక్తిగత దూషణలు మానుకుని ప్రజా సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రత్యర్థులకు ఆయన సూచించారు.
Comments
Loading comments...

