వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ పనితీరుపై ఆయన సతీమణి నజియా ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలను సేకరించారు. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, ఆసరా పింఛన్ల అమలు, కౌన్సిలర్ లభ్యతపై స్థానికుల ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు.
ఇచ్చిన హామీల మేరకు ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. భర్త పనితీరుపై భార్య స్వయంగా ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

