Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 6:16 PM వికారాబాద్General
తాండూరులో ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి - Udayam
తాండూరు మండలం గుంతబాసుపల్లిలోని ఓ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం కలకలం రేపింది. కర్ణాటక నుంచి వచ్చిన నలుగురు ఈ తవ్వకాలు జరిపినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో దశాబ్దాలుగా ఉన్న పాముల పుట్టను సైతం తవ్వేసినట్లు సమాచారం. పక్కనే అంగన్వాడీ కేంద్రం ఉండటంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నట్లు వెల్లడించారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...