Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో ఘనంగా శాకాంబరీ ఉత్సవాలు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 07, 2026 12:52 PM వికారాబాద్General
తాండూరులో ఘనంగా శాకాంబరీ ఉత్సవాలు - Udayam
​తాండూరులోని పలు ఆలయాల్లో ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రేణుకా ఎల్లమ్మ, రక్తమైసమ్మ ఆలయాల్లో అమ్మవార్లను కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించగా, మహిళలు సహస్రనామ పారాయణ చేశారు. పూజారులు తీర్థప్రసాదాలు అందజేయడంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ, పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...