Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో అర్హులందరికీ సంక్షేమ పింఛన్లు అందించనున్న కౌన్సిలర్ జావిద్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 2:01 PM వికారాబాద్General
తాండూరులో అర్హులందరికీ సంక్షేమ పింఛన్లు అందించనున్న కౌన్సిలర్ జావిద్ - Udayam
ఎన్నికల హామీ మేరకు వార్డులోని అర్హులందరికీ ప్రభుత్వ పింఛన్లు అందిస్తామని తాండూరులోని 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ స్పష్టం చేశారు. బుధవారం తన సతీమణితో కలిసి లబ్ధిదారుల దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు. అనర్హులను తొలగించి, పారదర్శకంగా నిజమైన పేదలకు కొత్త పింఛన్లు మంజూరు చేయిస్తామని, మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపిస్తామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...