వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోని వైఎన్ కాలనీలో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చోరీలు జరిగాయి. అర్ధరాత్రి ముసుగులు ధరించిన ముగ్గురు అనుమానితులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
మూడు ఇళ్లలో కలిపి సుమారు 10 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని దేవునిపల్లి పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

