వార్తలకు తిరిగి వెళ్లండి

తుగ్గలి మండలం రాతనలో కొళాయిల ద్వారా వస్తున్న తాగునీటిలో తెల్లటి పురుగులు, చెత్త వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటితో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని చెబుతున్నారు.
అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. తక్షణమే పరిశీలించి సురక్షిత తాగునీరు అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

