వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లి రన్నింగ్ రూమ్ సెంటర్ ఎస్సీ కాలనీలోని డ్రైనేజీ గుండా వెళ్తున్న మంచినీటి పైపును పక్కకు తొలగించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం 6వ వార్డు సచివాలయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
సైడ్ కాలువలోనే పైపు ఉండటం వల్ల మురుగునీరు కలసి మంచినీరు కలుషితమవుతోందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.
Comments
Loading comments...

