వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే శ్యాంబాబు ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే స్వయంగా పారిశుధ్య కార్మికుల జాకెట్ ధరించి, సిబ్బందితో కలిసి చీపురుతో రోడ్లు ఊడ్చారు.
పరిశుభ్రత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని కోరారు. ఇందులో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

