Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై డీఐజీ, కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 6:29 PM గుంటూరుGeneral
స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై డీఐజీ, కలెక్టర్ సమీక్ష - Udayam
రాజధాని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లను డీఐజీ రాజ కుమారి, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ బుధవారం పరిశీలించారు. ఈ నెల 13న జరగనున్న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్‌తో పాటు సీఎం,మంత్రులు, అఖిల భారత సర్వీసు అధికారుల కూర్చునే ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వేడుకలకు వచ్చే అతిథులు, ప్రజల రాకపోకల మార్గాలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...