స్వాపూర్‌లో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

బంట్వారం మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఎంపీడీఓ రాములు ప్రారంభించారు. సర్పంచ్ మంగలి స్రవంతి శివరాజ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
