వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్రాంత ఉపాధ్యాయుడు 20 పేజీల లేఖ రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో నివసిస్తున్న రిటైర్డ్ టీచర్ పగిడిపల్లి మల్లయ్య తన బావమరిది ఇతర బంధువులు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ జాప్యం జరిగినట్లు పేర్కొన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

