Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరిశిక్ష,

Follow Udayam on Google
DILIPREDDY Jul 07, 2026 3:22 PM జాతీయంక్రైమ్
సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరిశిక్ష, - Udayam
2008 అహ్మదాబాద్ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు విధించిన ఉరిశిక్షను, మరో 11 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను గుజరాత్ హైకోర్టు ఖరారు చేసింది. మొత్తం 56 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘోర దురంతంపై ప్రత్యేక కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. మొత్తం 49 మంది దోషులకు విధించిన శిక్షలను ధృవీకరిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే ఒకే కేసులో ఇంతమందికి మరణశిక్ష పడటం ఇదే ప్రథమం. ఈ చారిత్రాత్మక తీర్పుతో బాధితుల కుటుంబాలకు ఎట్టకేలకు న్యాయం జరిగింది.

Comments

G
Loading comments...