వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ అధికారుల సూచన మేరకే రైతులు యూరియాను వాడాలని దండేపల్లి మండల వ్యవసాయ అధికారి అజిత్ కుమార్ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో రైతులు వేసిన వివిధ పంటలు ఎదుగుదశలో ఉన్నాయన్నారు. ఈ సమయంలో పంట మొక్కలకు యూరియా అవసరముంటుందని అన్నారు.
అయితే వ్యవసాయ అధికారులు సూచించిన నిర్దేశిత ప్రమాణంలోనే యూరియాను వాడాలని ఆయన కోరారు. అలాగే నానో యూరియా వాడకంపై రైతులు దృష్టి పెట్టాలన్నారు.
Comments
Loading comments...

