Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లారెడ్డి కాలేజీల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు

ధీరజ్ రెడ్డి Jul 21, 2026 12:09 PM హైదరాబాద్about 6 hours ago
మల్లారెడ్డి కాలేజీల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు - Udayam Digital
మల్లారెడ్డి గ్రూప్‌ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు ఇతర ప్రైవేటు యూనివర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. సాంకేతిక విద్యాశాఖ ఆదేశాలతో 10 ప్రత్యేక బృందాలు ఈ ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నాయి. నిబంధనల అమలుపై దాదాపు 70 అంశాలతో కూడిన ఫార్మాట్‌లో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆడిట్, లీగల్ టీమ్‌లతో కలిసి తనిఖీలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...