Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవంతంగా 25వ గుండె మార్పిడి

Follow Udayam on Google
Vijay Pratap Singh Jun 05, 2026 12:32 PM తిరుపతిGeneral
విజయవంతంగా 25వ గుండె మార్పిడి - Udayam
తిరుపతి శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో 25వ గుండె మార్పిడి శస్త్రచికిత్స గురువారం విజయవంతంగా పూర్తయింది. కార్డియోమైపతితో బాధపడుతున్న 27 ఏళ్ల యువకుడికి వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన గుంటూరుకు చెందిన శివనాగ నర్సింహారావు కుటుంబం అవయవదానానికి ముందుకొచ్చింది. గ్రీన్‌ ఛానల్‌ ద్వారా గుండెను సేకరించి, వైద్య బృందం సకాలంలో శస్త్రచికిత్స పూర్తి చేయడంతో రోగి ప్రాణాలు నిలబడ్డాయి. దాత కుటుంబానికి కృతజ్ఞతలు.

Comments

G
Loading comments...