వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యవేడు మండలం బాలగోపాలపురం ఎస్టీ కాలనీ సమీపంలో తెలుగు గంగ గట్టు మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పది రోజులుగా రాత్రివేళల్లో ప్రొక్లైన్లతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అక్రమ తవ్వకాలపై గంగ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

