Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కస్తూర్బా పాఠశాలలో 18 మంది విద్యార్థినులకు అస్వస్థత

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 11:37 AM సిద్దిపేటGeneral
కస్తూర్బా పాఠశాలలో 18 మంది విద్యార్థినులకు అస్వస్థత - Udayam
సిద్దిపేట జిల్లా మద్దూరులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రాత్రి భోజనం అనంతరం 18 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో వారు ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గల కారణం అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

Comments

G
Loading comments...