Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్‌ మీడియా హననంపై కఠిన చట్టం తేవాలి

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 19, 2026 3:43 PM అమరావతిGeneral
సోషల్‌ మీడియా హననంపై కఠిన చట్టం తేవాలి - Udayam
సోషల్‌ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హననం, ఆన్‌లైన్ సైబర్ మోసాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తేవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. దిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నదుల అనుసంధానం, ఆక్వా రైతులకు మద్దతు, పోలవరం ప్రాజెక్టు గడువులోగా పూర్తి చేయడం వంటి కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలని, రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ.60 వేల కోట్ల కేంద్ర సహకారం కోరామని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...