Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

Follow Udayam on Google
శివ కుమార్ Jul 19, 2026 7:41 PM విజయనగరంGeneral
విజయనగరం కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ - Udayam
జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అధికారులు నేరుగా అర్జీలు స్వీకరిస్తారని, భూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అర్జీతో పాటు గుర్తింపు వివరాలు, ఆధారాలను జత చేయాలని, కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...