Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 14, 2026 6:51 PM మహబూబాబాద్ తెలంగాణ
రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు - Udayam
మహబూబాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ స్నేహ శబరిష్‌ అధికారులను ఆదేశించారు. మైనర్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, అతివేగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు ప్రమాదాల్లో 17 మంది మృతి చెందారని తెలిపారు. ఇకపై ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనర్‌ డ్రైవింగ్‌కు సంబంధించి 5 వాహనాలను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...