వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ శాఖ అత్యవసర ప్రణాళికను విడుదల చేసింది. వరి సాగు తగ్గించి, తక్కువ నీటితో పండే పత్తి, కంది, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించింది.
జులై 16-31 లోపు వర్షాలు పడితే పత్తి, కంది, పొద్దుతిరుగుడు వేయాలని, ఒకవేళ ఆగస్టు 1-15 మధ్య కురిస్తే కంది, చిరుధాన్యాలు, కూరగాయలు సాగు చేయాలని కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
Comments
Loading comments...

