Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెట్టింగ్‌కు బానిసై.. బైక్ చోరుడిగా మారి.

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 17, 2026 11:52 AM మెదక్General
బెట్టింగ్‌కు బానిసై.. బైక్ చోరుడిగా మారి. - Udayam
క్రికెట్ బెట్టింగుల్లో నష్టపోయి అప్పులపాలైన ఓ యువకుడు సిద్దిపేటలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన అబ్బరబోయిన ప్రశాంత్ అనే నిందితుడు సిద్దిపేటలో రెండు బైకులను దొంగిలించి పరారయ్యాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రెండు బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...