Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణాలు కాపాడితే రూ.25 వేల ప్రోత్సాహకం

Follow Udayam on Google
రేఖ దేవి Jul 17, 2026 11:57 AM మెదక్General
ప్రాణాలు కాపాడితే రూ.25 వేల ప్రోత్సాహకం - Udayam
రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడితే కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల ప్రోత్సాహకం అందిస్తుందని మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బాధితులకు లక్షన్నర రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుందని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో ప్రజలు మానవతా దృక్పథంతో స్పందించి, బాధితులను ఆసుపత్రికి తరలించాలని కోరారు. సమాచారం కోసం వెంటనే 100, 108 నంబర్లను సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...