Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ పాలు రోడ్డు పాలు

అశ్విని దేవి Jul 17, 2026 11:51 AM వరంగల్ 2 viewsabout 1 hour ago
అంగన్‌వాడీ పాలు రోడ్డు పాలు - Udayam Digital
వరంగల్ ఎనుమాముల-కొత్తపేట ప్రధాన రహదారిపై గురువారం భారీ సంఖ్యలో విజయ డెయిరీ ఆరోగ్యలక్ష్మి టెట్రాప్యాక్ ఖాళీ పాలు డబ్బాలు కుప్పలుగా ప్రత్యక్షమయ్యాయి. అంగన్‌వాడీ గర్భిణులు, బాలింతలకు చేరాల్సిన పాలు ఇలా రోడ్డు పాలు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సుమారు పది వేల వరకు ఉన్న ఈ ఖాళీ డబ్బాలను ఎవరో రాత్రికి రాత్రే నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్లు తెలుస్తోంది. పంపిణీ చేయకుండానే స్వప్రయోజనాల కోసం వాడి పడేశారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...