Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై దాడులు ఆపం.. మాజీలంతా మూర్ఖులే: ట్రంప్

Follow Udayam on Google
Divya Jun 11, 2026 12:46 AM జాతీయంGeneral
ఇరాన్‌పై దాడులు ఆపం.. మాజీలంతా మూర్ఖులే: ట్రంప్ - Udayam
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యంతో పాటు అమెరికాపైనా దాడులు జరిగేవని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై తాము కఠినంగా వ్యవహరిస్తూ గట్టి దెబ్బ కొడుతున్నామని స్పష్టం చేశారు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ తమను బురిడీ కొట్టిస్తోందని మండిపడ్డారు. గతంలో అమెరికాను పాలించిన కొందరు మూర్ఖపు అధ్యక్షుల వల్లే ఇరాన్ తమతో ఇన్నాళ్లుగా ఆటలాడుకుంటోందని ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Comments

G
Loading comments...