Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రారంభం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 13, 2026 3:19 PM కర్నూలుGeneral
ఆదోనిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రారంభం - Udayam
ఆదోని పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. ఆర్డీవో అరుణాదేవి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఇంటా మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు ప్రాణత్యాగం చేశారని, వారి సేవలను నేటి, భావితరాలు గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచి దేశసేవ, రక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...