వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడు విశాల్ ‘పురుషన్’ సినిమా షూటింగ్‌లో గాయపడినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. గోవాలో గురువారం ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా గాయాలైనట్లు సమాచారం. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.
ప్రస్తుతం షూటింగ్ నిలిపివేయగా, విశాల్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Loading comments...

