వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్డులో ఎస్‌బీఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న మున్సిపాలిటీ ఖాళీ స్థలంలో 7 షాపులకు స్థలాన్ని మూడేళ్లకు లీజుకు ఇవ్వనున్నట్లు కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు.
ఒక్కో షాపుకు 10×20 అడుగుల స్థలం, నెలసరి అద్దె రూ.6 వేలు నిర్ణయించారు. ఆసక్తిగల వారు సెప్టెంబర్ 24లోగా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 25న ఉదయం 11:30 గంటలకు లక్కీ డిప్ ద్వారా షాపుల ఎంపిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

