వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ MRO ఆఫీసులో సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతోందని బీజేపీ గిరిజన జిల్లా అధ్యక్షుడు పండిత్ ఆరోపించారు. గిరిజనులు దరఖాస్తు చేసి నెల దాటినా సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కార్యాలయంలో ఫైళ్లు మిస్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులకు వెంటనే సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ సమస్యపై ఎమ్మెల్యే, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

