Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 13, 2026 2:21 PM మంచిర్యాలGeneral
శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ - Udayam
రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా గురువారం శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించి, విచారణలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణ కోసం రౌడీ, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ఇన్‌స్పెక్టర్ అశోక్‌ను హెచ్చరించారు.

Comments

G
Loading comments...