Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక క్వార్టర్స్‌ సమస్యల పరిష్కారానికి వినతి

మహేష్ కుమార్ Jul 25, 2026 2:16 PM పెద్దపల్లి about 2 hours ago
శ్రీలంక క్వార్టర్స్‌ సమస్యల పరిష్కారానికి వినతి - Udayam Digital
రామగిరి మండలం పన్నూర్ పంచాయతీ పరిధిలోని శ్రీలంక క్వార్టర్స్‌లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సర్పంచి చిందం మహేష్ కోరారు. ఈ మేరకు ఆర్‌జీ-3 జీఎం సుంకరి మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. బస్సుల కోసం ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆరు బస్ షెల్టర్లు నిర్మించాలని, క్వార్టర్స్‌లో ప్రత్యేక తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...