వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా నేడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్యానల్ స్పీకర్ హోదాలో సభాధ్యక్ష స్థానంలో ఆసీనులై సభను నడిపించారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్యానల్ స్పీకర్ హోదాలో సభను నడిపించడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, సీనియర్ నాయకుడిగా ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా గత సభలో ప్రాతినిధ్యం వహించారు.
Comments
Loading comments...

