Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేగవంతం కానున్న జిల్లాల ప్రయాణం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 05, 2026 7:05 AM హైదరాబాద్General
వేగవంతం కానున్న జిల్లాల ప్రయాణం - Udayam
తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు భారీ ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల నుంచి నగర శివార్లకు చేరుకున్నప్పటికీ, అక్కడి నుంచి సికింద్రాబాద్ తదితర ప్రధాన ప్రాంతాలకు వెళ్లడానికి పీక్ అవర్స్‌లో గంటన్నర పైనే సమయం పడుతోంది. ఈ రెండు కారిడార్ల అందుబాటుతో ప్రయాణ సమయం కేవలం 10-15 నిమిషాలకు తగ్గిపోనుంది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు.

Comments

G
Loading comments...