Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై పోలీసుల ప్రత్యేక యాప్

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 29, 2026 10:56 AM అమరావతిGeneral
సైబర్ మోసాలపై పోలీసుల ప్రత్యేక యాప్ - Udayam
సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నగర పోలీసులు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. సీపీ రాజశేఖరబాబు ఆదేశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ యాప్‌లో నకిలీ లింకులు, ఫోన్ నంబర్లను తనిఖీ చేసే ఫీచర్లు ఉండనున్నాయి. చాట్‌బాట్, సైబర్ అవగాహన వీడియోలు, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం కూడా యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రజలకు ఉపయోగపడేలా నెల రోజుల్లో ఈ యాప్‌ను సిద్ధం చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...