వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ-గుమ్మల్లపల్లి మధ్య ఒడిపిలవంచకు చెందిన చిగురు గణేష్‌పై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
స్థానికుల కేకలతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

