వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల వరాహస్వామి కార్ పార్కింగ్ ప్రాంతంలో బహిరంగంగా బీడీ తాగిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా తమిళనాడుకు చెందిన సంతోష్ (31)ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తిరుమలలో ధూమపానం, మద్యపానం, మత్తు పదార్థాల వినియోగం నిషేధమని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

