వార్తలకు తిరిగి వెళ్లండి

సోన్ మండలంలోని గాంధీనగర్ లో ఉద్యానవన అధికారిణి మౌనిక ఆయిల్ పామ్ తోటలను పరిశీలించారు. సిగ్నెట్ కంపెనీ డిసిఓ, రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఆధునిక యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, క్రమం తప్పకుండా నీరు, ఎరువులు అందించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. తెగుళ్ల నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, ఏదైనా సమస్య ఉంటే అధికారులను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

