Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత భూమిపై మున్సిపల్ జోక్యంపై నిరసన

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:01 PM వనపర్తిGeneral
సొంత భూమిపై మున్సిపల్ జోక్యంపై నిరసన - Udayam
పోచమ్మ గుడి ప్రాంగణంలోని సర్వే నంబర్ 280/3లో నాయీబ్రాహ్మణులకు చెందిన భూమికి కంచె ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ చైర్మన్, అధికారులు అడ్డుకుంటున్నారని భూ యజమానులు ఆరోపించారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగలి బాలప్ప వారసులు నిరసన చేపట్టారు. తహసీల్దార్ తమను హక్కుదారులుగా ప్రకటించినప్పటికీ అధికారులు అడ్డుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...