వార్తలకు తిరిగి వెళ్లండి
సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసు విచారణలో ఉండగా ఆమె పరారయ్యే అవకాశం ఉందన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
మూడు వారాల్లోగా దర్యాప్తు అధికారుల ముందు లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆరు నెలల్లోగా విచారణ పూర్తి కాకపోతే, సోనమ్ తిరిగి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
Comments
Loading comments...