వార్తలకు తిరిగి వెళ్లండి
తండ్రి వెంటే వెళ్లిన కుమారుడు

నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం చెన్నోళ్ల కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బుధవారం వృద్ధుడు సాయిలు (75) మరణించగా, ఆ దుఃఖంలో ఉన్న చిన్నకుమారుడు బంగారయ్య (50) గురువారం అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.
తండ్రి చనిపోయిన మరుసటి రోజే కొడుకు కూడా మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర రోదనలు మిగిలాయి. ఈ ఘటనతో స్థానిక గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...