వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లు కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
సివిల్, క్రిమినల్, చెక్కు బౌన్స్, కుటుంబ తగాదాలు, మనోవర్తి, గృహహింస, ఎక్సైజ్, బ్యాంకు, BSNL వివాదాలను ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

