Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమయపాలన పాటించాలి : MEO

Follow Udayam on Google
RAGHU Aug 25, 2026 12:08 PM శ్రీకాకుళంGeneral
సమయపాలన పాటించాలి : MEO - Udayam
జలుమూరు మండల కేంద్రంలోని మండల ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఉదయం ఎంఈఓ బి.మాధవరావు ప్రార్థన సమయంలో సందర్శించారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా సమయపాలన పాటించాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇస్తూ సమయానికి పాఠశాలలకు చేరేలా చేయాలన్నారు. పాఠశాలను పరిశీలించి మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...