వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వాజేడు మండలంలోని చింతూరు, ధర్మవరం, అయ్యవారిపేట గ్రామపంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజా పోరాటసమితి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వాజేడు ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
అధ్వానంగా ఉన్న రహదారులు, పాఠశాలలకు ప్రహరీలు, భూముల రక్షణ, పారిశుధ్యం, ఫాగింగ్, పల్లెప్రకృతి వనాల అభివృద్ధి, ఆరోగ్య కేంద్రం పనులు పూర్తి చేయాలని కోరారు.
Comments
Loading comments...

