వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు, ప్రజా సమస్యలపై బిజెపి నిరంతరాయ ఉద్యమాలు చేస్తుందని బిజెపి లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు హరిగోపాల్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని స్థానిక ఐబీలో మీడియా సమావేశం నిర్వహించారు.
కడెం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ మాట్లాడితే ఆయనపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతులు, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమిస్తూనే ఉంటామన్నారు.
Comments
Loading comments...

