Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

Follow Udayam on Google
S kumar Sep 12, 2026 4:11 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఎంఈఓ సురేందర్ అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...